Andhra Pradesh: అరెస్ట్‌పై వల్లభనేని వంశీ భార్య రియాక్షన్..
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:16 PM
కిడ్నాప్, బెదిరింపుల కేసులో విజయవాడ పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంపై వంశీ భార్య స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారు.. పోలీసులపై ఎలాంటి కామెంట్స్ చేశారు.. ఈ కథనంలో తెలుసుకుందాం..

విజయవాడ, ఫిబ్రవరి 13: వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై ఆయన భార్య పంకజశ్రీ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎఫ్ఐఆర్ కాపీని ఇంకా తమకు ఇవ్వలేదని చెప్పాపరు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తమకు తెలియదని చెప్పారామె. వివరాలు అడిగినా పోలీసులు చెప్పడం లేదని ఆరోపించారు. అరెస్ట్ చేసి చాలా సమయం అవుతున్నప్పటికీ.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. పోలీసులు.. వంశీని అక్రమ అరెస్ట్ చేశారని ఆయన భార్య మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగర్‌గా వెళ్లడానికి తమకు అవకాశం ఉండదని.. అందుకే పోలీసులు తమకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం లేదని పంకజశ్రీ ఆరోపించారు. వంశీతో అరగంటపాటు మాట్లాడారు పంకజశ్రీ.