CPM V. Srinivasa Rao : కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్య రంగాలకు మొండిచేయి
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:36 AM
‘బడ్జెట్ కేటాయింపు-సవాళ్లు’ అనే అంశంపై ఆదివారం నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో శ్రీనివాసరావు మాట్లాడారు.

దేశవ్యాప్త ఆందోళనలు, నిరసనలకు శ్రీకారం: సీపీఎం
నెల్లూరు(వైద్యం), ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): దేశ సంపద, వనరులను దోచి పెట్టడమే వికసిత భారత్ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. ‘బడ్జెట్ కేటాయింపు-సవాళ్లు’ అనే అంశంపై ఆదివారం నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో శ్రీనివాసరావు మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. పేదరికం, నిరుద్యోగం, ఆహార కొరత, రైతు ఆత్మహత్యలు వంటి సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు బడ్జెట్‌లో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికంతో అమెరికాకు వెళ్లిన భారత పౌరులను సంకెళ్లతో పంపిస్తే ప్రశ్నించే ధైర్యం కూడా ప్రధాని మోదీ చేయకపోవటం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌కూ బడ్జెట్‌లో తగిన కేటాయింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోగా విభజన హామీలు కూడా కేంద్రం నెరవేర్చలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టబోతున్నట్లు తెలియచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..