UAE AP Economic Partnership: ఏపీతో కలసి పనిచేస్తాం
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:43 AM
యూఏఈకి భారత్ నమ్మకమైన భాగస్వామి. దావోస్‌లో సీఎం చంద్రబాబును కలిసినపుడు కేవలం 5 నిమిషాల్లోనే ఏపీ
యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్
యూఏఈకి భారత్ నమ్మకమైన భాగస్వామి. దావోస్‌లో సీఎం చంద్రబాబును కలిసినపుడు కేవలం 5 నిమిషాల్లోనే ఏపీ గురించి పూర్తిగా వివరించారు. ఇక్కడ నీటి వనరులు అపారంగా ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆలవాలమైన ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాం. వయూఏఈ-ఇండియా ఎకనామిక్ కారిడార్‌లో ఏపీ ఓ కీలకమైన భాగస్వామిగా మారుతుంది. ఇన్వెస్టోపియా ద్వారా అన్ని ప్రాంతాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా లక్ష్యం. ఏఐ, ఫ్యూచర్ ఎకానమీ, రిటైల్, ఏవియేషన్ రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం ఉంది. 250 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉంది. 4.2 మిలియన్ల టూరిస్టులు భారత్ నుంచి యూఏఈకి వచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ బాగా పెరిగింది. ఇరు దేశాల మధ్య 67 వేల సంస్థలు పని చేస్తున్నాయి.
- అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రి,
యూఏఈ మంత్రి
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!