Tuhin Kumar Sworn: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్‌కుమార్ ప్రమాణం
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:12 AM
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూ ర్తిగా జి.తుహిన్ కుమార్ సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూ ర్తిగా జి.తుహిన్ కుమార్ సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్.. ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా, ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, తుహిన్‌కుమార్ కుటుంబ సభ్యులు, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎ్‌సబీజీ పార్థసారఽథి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, రిజిస్ట్రార్‌లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News