TTD.: టీటీడీ సొంత చాట్‌బాట్
ABN , Publish Date - May 27 , 2025 | 05:53 AM
టీటీడీ భక్తులకు సులభంగా, వేగంగా సమాచారం అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. వాయిస్, టైపింగ్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ దర్శనం, సేవలు, బుకింగ్స్, చెల్లింపులు వంటి సౌకర్యాలను ఈ చాట్‌బాట్ ద్వారా లభ్యం చేయనున్నట్లు తెలిపింది.
చాట్ జీపీటీ తరహాలో రూపకల్పనకు ఐటీ విభాగం కసరత్తు
జియో, టీసీఎస్ ప్రతినిధులతో కమిటీ
తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ జీపీటీ తరహాలో ‘చాట్‌బాట్’ను రూపొందించే పనికి టీటీడీ శ్రీకారం చుట్టింది. టీటీడీ పరిధిలోని ఏ సమాచారాన్నయినా భక్తులు సులువుగా, సంక్షిప్తంగా, అత్యంత వేగంగా తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. భక్తులు ఏ భాషలో అడిగినా, కోరిన సమాచారం క్షణాల్లో అందేలా దీన్ని రూపొందిస్తారు. టైపింగ్‌తోనే కాకుండా వాయిస్ కమాండ్‌తో కూడా సమాచారాన్ని పొందవచ్చు. అలాగే దర్శనం, ఆర్జితసేవలు, గదులు, కల్యాణ వేదిక, ప్రసాదాల బుకింగ్, విరాళాలు చెల్లింపులు, వివిధ రకాల పేమెంట్లు వంటి సౌకర్యాలు కూడా ఈ చాట్‌బాట్ ద్వారా లింక్స్ రూపంలో పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు సూచనలతో టీటీడీ ఐటీ విభాగం ఇప్పటికే ఇందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీటీడీ చాట్‌బాట్ రూపకల్పన కోసం ఐటీ విభాగం జీఎం, డీజీఎంలతో పాటు జీయో, టీసీఎస్ ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ పేరుతో దాదాపు పది సంస్థలు ఇచ్చిన డెమోలను ఈ బృందం పరిశీలించింది. మరికొన్ని సంస్థల డెమోలను కూడా పరిశీలించిన తర్వాత తుది రూపంతో కూడిన నివేదికను బృందం సమర్పిస్తుంది. అనంతరం ఈసేవలను అందించే సంస్థలనుంచి టెండర్లకు ఆహ్వానిస్తారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News