Share News

TTD Employee Protest: నిరసన వీడియో తీసింది టీటీడీ ఉద్యోగే

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:37 AM

తిరుమలలో శ్రీవారి క్యూలైన్‌లో భక్తుల నిరసన వీడియోను టీటీడీ హెల్త్ విభాగ ఉద్యోగి తీసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

TTD Employee Protest: నిరసన వీడియో తీసింది టీటీడీ ఉద్యోగే

తిరుమల, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): శ్రీవారి సర్వదర్శన క్యూలైన్‌లో భక్తుల నిరసనల వీడియో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది టీటీడీ హెల్త్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగేనని తెలిసింది. అన్నప్రసాదాలు, పాలు అందడం లేదంటూ గత శుక్రవారం రాత్రి కాకినాడకు చెందిన అచ్చారావు టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పక్కనే మరికొంతమందితో కూడా నిరసనలు చేయించారు. దీంతో అచ్చారావుపై బైండోవర్‌ కేసు నమోదు కాగా, క్యూలైన్‌ వెలుపల నుంచి వీడియో తీసింది ఎవరనే అంశంపై టీటీడీ విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ హెల్త్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగే ఈ వీడియోను చిత్రీకరించినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. టీటీడీలో పనిచేస్తూ.. ఎందుకు వీడియో తీశారు? ఎందుకు బయటపెట్టారనే అంశాలపై విజిలెన్స్‌ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Jun 02 , 2025 | 03:41 AM