AP Govt : గిరిజన సంక్షేమ అధికారులకు పదోన్నతులు
ABN , Publish Date - Feb 20 , 2025 | 06:19 AM
జాయింట్ డైరెక్టర్ ఎం.సరస్వతికి అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి ఆమె పనిచేస్తున్న మైదాన ప్రాంత ప్రాజెక్టు అధికారిగా నియమించారు.
ABN AndhraJyothy: గిరిజన సంక్షేమశాఖ అధికారులకు పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తూ గిరిజన సంక్షేమశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. జాయింట్ డైరెక్టర్ ఎం.సరస్వతికి అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి ఆమె పనిచేస్తున్న మైదాన ప్రాంత ప్రాజెక్టు అధికారిగా నియమించారు. జాయింట్ డైరెక్టర్ కె.రామశేషుకు అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి తిరిగి ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా నియమించారు. గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ బి.మల్లికార్జునరెడ్డికి అదనపు కమిషనర్‌గా పదోన్నతి కల్పించి నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ట్రైకార్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ సి.ఆనంద్ మణికుమార్‌కు ట్రైకార్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.