Share News

Tirupati: శోకసంద్రంలో వేదాంతపురం.. నదిలో నలుగురు గల్లంతు..

ABN , Publish Date - Oct 24 , 2025 | 08:26 PM

విష్ణు, మణిరత్నం, కృష్ణ ప్రమాదం నుంచి బయటపడగా.. ప్రకాశ్, చిన్న, తేజు, బాలు మాత్రం గల్లంతయ్యారు. చిన్నారులు విషయం చెప్పడంతో గ్రామస్థులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు.

Tirupati: శోకసంద్రంలో వేదాంతపురం.. నదిలో నలుగురు గల్లంతు..
Tirupati Tragedy

తిరుపతి, అక్టోబర్ 24: తిరుపతి రూరల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు స్వర్ణముఖి నదిలో గల్లంతయ్యారు. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం 4 గంటల సమయంలో గ్రామానికి చెందిన ప్రకాశ్ (17), చిన్నా (15), తేజు (19), బాలు (16) విష్ణు (12), మునిరత్నం (15), కృష్ణ (13) అనే ఏడుగురు చిన్నారులు నది వద్దకు చేరుకున్నారు. ఇసుక దిబ్బలపై సరదాగా ఆడుకుంటూ.. స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు.


ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ వారంతా స్వర్ణముఖి నదిలో కొట్టుకుపోయారు. అయితే విష్ణు, మణిరత్నం, కృష్ణ ప్రమాదం నుంచి బయటపడగా.. ప్రకాశ్, చిన్న, తేజు, బాలు మాత్రం గల్లంతయ్యారు. చిన్నారులు విషయం చెప్పడంతో గ్రామస్థులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుచానూరు ఎస్సై సాయినాథ చౌదరి, బ్లూ కోర్టు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిన్నారు.

మరోవైపు సంఘటనా స్థలాన్ని ఎస్పీ సుబ్బరాయుడు సైతం పరిశీలించారు. గాలింపు చర్యల్లో భాగంగా ఒకరి మృతదేహం లభ్యమైంది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి మృతదేహాన్ని చూసి బాధిత కుటుంబం, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, మిగిలిన చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

Sahiti Infra: సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

HYDRAA: ఆక్రమణల తొలగింపు.. 2 వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

Updated Date - Oct 24 , 2025 | 09:49 PM