Share News

Tirupati : తిరుపతిలో నేటి నుంచి ఆలయ సదస్సు

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:06 AM

ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం...

 Tirupati : తిరుపతిలో నేటి నుంచి ఆలయ సదస్సు

  • హాజరుకానున్న ఏపీ, గోవా, మహారాష్ట్ర సీఎంలు

తిరుపతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా నిలిచింది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం, డిజిటలైజేషన్‌, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం వంటి వ్యూహాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో(ఐటీసీఎక్స్‌) సదస్సు జరగనుంది. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌ సెంటర్లో సోమవారం జరిగే ప్రారంభ సభకు సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రతినిధి సీఆర్‌ ముకుంద్‌, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దేవాలయ పరిపాలన, నిర్వహణకు సంబంధించి జరగనున్న ఐటీసీఎక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆలయాల ప్రతినిధులు హాజరుకానున్నట్టు టెంపుల్‌ కనెక్ట్‌ వ్యవస్థాపకుడు గిరేష్‌కులకర్ణి, ఎక్స్‌పో చైర్మన్‌, మహారాష్ట్ర మండలి చీఫ్‌ విప్‌ ప్రసాద్‌ లాడ్‌ చెప్పారు.

Updated Date - Feb 17 , 2025 | 03:08 AM