Yoga Performance: శ్రీవారి ఆలయం ముందు కాకినాడ బాలిక యోగాసనాలు
ABN , Publish Date - May 05 , 2025 | 04:50 AM
తిరుమల శ్రీవారి ఆలయం ముందు కాకినాడ బాలిక రేఖాడి చైత్ర 15 నిమిషాల పాటు యోగాసనాలు వేయగా భక్తులు ఆశ్చర్యపోయారు.యోగాలో జాతీయ స్థాయిలో మెడల్ సాధించాలన్న లక్ష్యంతో ఆమె సాధన కొనసాగుతోంది.
తిరుమల మే 4 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయం ముందు 14 ఏళ్ల బాలిక యోగాసనాలు వేస్తూ అందరినీ ఆకర్షించింది. కాకినాడకు చెందిన రేఖాడి చైత్ర జివాస్కి తన తల్లిదండ్రులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం శనివారం తిరుమలకు వచ్చింది. శ్రీవారి దర్శనం అనంతరం ఆదివారం ఉదయం ఆలయం ముందుకు చేరుకున్న రేఖాడి వివిధ రకాల యోగాసనాలు వేయడంతో పలువురు భక్తులు ఆశ్చర్యంగా తిలకించారు. సుమారు 15 నిమిషాల పాటు ఆలయం ముందు ఆమె ఆసనాలు వేసింది. అనంతరం రేఖాడి చైత్ర మీడియాతో మాట్లాడుతూ.. యోగాలో జాతీయ మెడల్ సాధించడం తన లక్ష్యమని పేర్కొంది. వ్యాయామ ఉపాధ్యాయురాలు త్రిపుర తనకు యోగాను పరిచయం చేయగా, మరో గురువు దుర్గాశాంతి ప్రసాద్ యోగాను పూర్తిగా నేర్పించారని తెలిపింది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి