Tirumala Security : అలిపిరిలో తనిఖీలు డొల్ల!
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:12 AM
టీటీడీలో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి బట్టబయలైంది.

కోడిగుడ్లు, పలావ్‌తో తిరుమలకు చేరుకున్న బృందం
తిరుమల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): టీటీడీలో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి బట్టబయలైంది. కోడిగుడ్లు, పలావ్ ఉన్న భారీ పాత్రతో ఓ బృందం నేరుగా అలిపిరి మీదుగా తిరుమలకు చేరుకుంది. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు సమీపంలోని గుమ్మడిపూడికి చెందిన 28 మందితో కూడిన ఇతర మతానికి చెందిన ఓ బృందం శుక్రవారం ఉదయం అలిపిరి నుంచి ఘాట్‌లో తిరుమలకు చేరుకుంది. రాంభగీచ బస్టాండ్‌కు సమీపంలోని పార్కింగ్‌లో వారు తమ వెంట తీసుకువచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ తింటుండగా చూసిన భక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తిరుమలలో నిబంధనల గురించి తమకు తెలియదని వారు వివరణ ఇచ్చారు.