Tirumala: తిరుమలలో భారత మొట్ట మొదటి AI-ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:53 PM
భారతదేశంలో మొట్టమొదటి AI-పవర్డ్, భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో ప్రారంభమైంది. ఇది మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని సూచిస్తుంది.
తిరుమల, సెప్టెంబర్ 25 : భారతదేశంలో మొట్టమొదటి AI-పవర్డ్ భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) తిరుమలలో ప్రారంభమైంది. ఇది మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని సూచిస్తుంది. ఇది.. మొత్తం దేవస్థాన వ్యవస్థ భౌతిక, సైబర్ మానిటరింగ్‌ను ఏకీకృతం చేసే అధునాతన AI-చాటెడ్ కమాండ్ సెంటర్. NRIల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భక్తుల భద్రత, సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. ఈ వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ సెంటర్‌లో 6,000కి పైగా AI-ఎనాబుల్డ్ కెమెరాలు ఉన్నాయి. ఇవి, ప్రతి నిమిషానికి 3,60,000 పేలోడ్‌లను ప్రాసెస్ చేస్తూ, ప్రతిరోజూ 51.8 మిలియన్ ఈవెంట్‌లను హ్యాండిల్ చేసి, 2.5 బిలియన్ ఇన్ఫరెన్స్‌లను రియల్-టైమ్‌లో జనరేట్ చేస్తుంది. అంతేకాదు, ఈ సాంకేతికత.. భక్తుల కార్యకలాపాలను రియల్-టైమ్‌లో మానిటర్ చేసి, మొత్తం ఆలయ నిర్వహణను డిజిటల్‌గా మార్చుతుంది.

ICCC వ్యవస్థ ద్వారా భక్తులకు అన్ని అంశాల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని టీటీడీ అధికారులు చెప్పారు. NRIల ఆర్థిక సహకారంతో తీసుకొచ్చిన ఈ మైలురాయి ప్రాజెక్ట్, భారతదేశంలో ఆధ్యాత్మిక వ్యవస్థలకు టెక్నాలజీ ఆధారిత సరికొత్త మార్గాన్ని తీసుకొస్తాయని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్
యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట