Tirumala: తిరుమలలో తరగని రద్దీ
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:47 AM
తిరుమల క్షేత్రం నాలుగురోజులుగా యాత్రికులతో కిటకిటలాడుతోంది.
తిరుమల, జూలై14(ఆంధ్రజ్యోతి): తిరుమల క్షేత్రం నాలుగురోజులుగా యాత్రికులతో కిటకిటలాడుతోంది. గురువారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లతోపాటు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోతూనే ఉన్నాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్ మీదుగా బాటగంగమ్మ, శ్రీవారిసేవాసదన్, అక్టోబస్ సర్కిల్ వరకు క్యూలైన్ వ్యాపిస్తోంది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్ శిలాతోరణ సర్కిల్ వరకు ఉంది. వీరికి 15 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్ టోకెన్లు, టికెట్లు ఉన్నవారికి మూడు నుంచి నాలుగు గంటల తర్వాతే దర్శనం లభిస్తోంది.