Tirumala Brahmotsavam 2025: నేటి నుంచే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:17 AM
ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు లాంఛానంగా ప్రారంభం అవుతాయి. సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగుర వేయనున్నారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు (బుధవారం)నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు లాంఛానంగా ప్రారంభం అవుతాయి. సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగుర వేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాత్రి 7.50 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
రాత్రి 9 గంటలకు ప్రారంభం అయ్యే పెద్ద శేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మంత్రి నారా లోకేశ్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మంత్రి లోకేశ్ హెలికాప్టర్‌లో బయల్దేరి బుధవారం సాయంత్రం 5 గంటలకు తిరుపతి చేరుకుంటారు. తిరుపతినుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని, రాత్రి శ్రీవారిని దర్శించుకుంటారు.
కాగా, భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తొలిసారి అధికారిక హోదాలో తిరుమల రానున్నారు. ఈ రోజు(బుధవారం) రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయన తిరుమల చేరుకుంటారు. 8 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. గురువారం మరోసారి స్వామి వారిని దర్శించుకుంటారు. రేపు కొండపై జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ అదే పాట.. ఇండియా, పాక్ యుద్ధాన్ని వాడేసుకుంటున్న ట్రంప్..
మహిళలు, అట్టడుగు వర్గాలకు ఈ-సేవలు