Share News

TTD: తిరుమల నడక దారిలో యువకుడి మిస్సింగ్‌

ABN , Publish Date - Mar 06 , 2025 | 06:49 AM

తిరుమల అవ్వాచారికోన లోయ వద్ద బుధవారం ఉత్కంఠ నెలకొంది. ‘కాలినడకమార్గంలోని లోయలో ఎవరో యువకుడు దూకేశాడు’ అంటూ ఓ భక్తుడు భద్రతా సిబ్బందికి బుధవారం ఉదయం సమాచారం ఇచ్చాడు

TTD: తిరుమల నడక దారిలో యువకుడి మిస్సింగ్‌

  • లోయలోకి దూకాడని భద్రతా సిబ్బందికి సమాచారం

  • రెండున్నర గంటలపాటు గాలించినా లభించని ఆచూకీ,

  • సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన.. నేడు మరోసారి గాలించాలని నిర్ణయం

తిరుమల, మార్చి 5(ఆంధ్రజ్యోతి): తిరుమల అవ్వాచారికోన లోయ వద్ద బుధవారం ఉత్కంఠ నెలకొంది. ‘కాలినడకమార్గంలోని లోయలో ఎవరో యువకుడు దూకేశాడు’ అంటూ ఓ భక్తుడు భద్రతా సిబ్బందికి బుధవారం ఉదయం సమాచారం ఇచ్చాడు. తిరుమల ఏఎస్పీ సూచనతో టీటీడీ విజిలెన్స్‌ అధికారులు, పోలీసు అధికారి సహా 40 మంది అవ్వాచారి కోన లోయలోకి తాళ్ల సాయంతో దిగారు. సుమారు రెండున్నర గంటల పాటు గాలించినా ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో సమాచారం నిజం కాదని నిర్ధారించుకుని తిరిగి వచ్చినా,. ివిచారణ కొనసాగించారు. భక్తుడు చెప్పినట్టుగా తలనీలాలు సమర్పించి తిరుమల నుంచి కాలినడక ప్రారంభించి తిరుపతికి ఎవరైనా చేరుకోలేదా అనే కోణంలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఓ వ్యక్తి మార్గమధ్యలో కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. రివర్స్‌ మోడ్‌ విధానంలో పరిశీలన చేయగా మంగళవారం రైలు దిగి తిరుమలకు చేరుకున్న ఆ వ్యక్తి తలనీలాలు సమర్పించి తిరుమలలోని ఓ దుకాణంలో టీ మాస్టర్‌గా పనిచేసే వీరప్ప అనే స్నేహితుడ్ని కలిశారు. దర్శనం అనంతరం బుధవారం ఉదయం తిరుమల నుంచి అలిపిరి నడకమార్గంలో బయలుదేరారు. అయితే దూకిన వ్యక్తి లోయలో కనిపించకపోవడంతో తిరిగి మరొక మార్గంలో తిరుమలకే వచ్చాడా, లేకుంటే ఎక్కడైనా ఉండిపోయాడా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గురువారం ఉదయం మరోసారి గాలించాలని భావిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2025 | 06:50 AM