Farmers Suicide: అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
ABN , Publish Date - May 19 , 2025 | 05:50 AM
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల భారంతో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంటలకు గరిష్ట ధర లేక కష్టపడుతూ తీవ్ర మనోనిరాశలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం.

క్రోసూరు/గుత్తిరూరల్/ఆదోని రూరల్, మే 18 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక రాష్ట్రంలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన ఎర్రనేని చిన్న వెంకటేశ్వర్లు(59) రెండు ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. పండించిన పంటకు ధర పలకలేదు. సుమారు రూ.10 లక్షలు వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురై ఆదివారం ఉదయం పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన బంధువులు, స్థానికులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన మహేంద్ర (39) తన పదెకరాల పొలంలో 5 బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. కొన్నేళ్లుగా వేరుశనగ, ఆముదం, పత్తి పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు. బోర్లు వేసేందుకు, పంటల సాగుకు చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరాయి. తీవ్ర మనస్థాపంతో ఇంట్లోనే ఉరేసుకోగా బంధువులు గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర(30) తన నాలుగెకరాల పొలంలో రెండేళ్లుగా మిరప, ఉల్లి పంటలు సాగుచేశాడు. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. సుమారు రూ.8 లక్షలు అప్పు తీర్చే మార్గంలేక ఆదివారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి