IIT Graduate: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి..
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:38 AM
ఐఐటీ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, రెండు సార్లు సివిల్స్ రాసి ఐపీఎస్ ఎంపిక అయిన బి. వెంకటేశ్ ఈసారి 15వ ర్యాంకుతో ఐఏఎస్ కలను సాకారం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా అల్లాడపేటకు చెందిన ఆయన విజయంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
15వ ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లావాసి వెంకటేశ్
2023లో ఐపీఎస్‌కు.. తాజాగా ఐఏఎస్‌కు ఎంపిక
నరసన్నపేట/ జలుమూరు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఐఐటీ చదివి, చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. గతంలో రెండుసార్లు సివిల్స్ రాసి.. రెండోసారి ఐపీఎస్‌కు ఎంపికయ్యారాయన. దాంతో సంతృప్తి చెందక.. మరోసారి పరీక్ష రాసి ఈసారి 15వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కలను సాకారం చేసుకున్నారు. ఆయనే.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బి.వెంకటేశ్. అల్లాడపేట ఓ కుగ్రామం. ఈ గ్రామానికి గతంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో అద్దోనంపేటగా కూడా పిలిచేవారు. అటువంటి గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకటేశ్.. ఉన్నత చదువులు చదివి, సివిల్స్‌లో సత్తాచాటి ఔరా అనిపించారు. ఆయన ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు చంద్రరావు, రోహిణి, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్‌కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫోన్‌లో అభినందనలు తెలిపారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..