Share News

CM Chandrababu: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jul 18 , 2025 | 09:06 PM

వాణిజ్య పంటల రైతులకు మెరుగైన సబ్సిడీ, రాయితీలు ఇచ్చేలా కేంద్రాన్ని కోరాలని పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీతో పాటు రాజధాని అభివృద్ధికి..

CM Chandrababu: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు
CM Chandrababu

అమరావతి, జులై 18: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రంలో టీడీపీ కీలకపాత్ర పోషిస్తున్నందున ఎంపీల బాధ్యత మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అంశాలే ప్రధాన అజెండాగా ఎంపీలు పార్లమెంట్‌లో ఎలుగెత్తాలని, రాష్ట్ర ప్రగతిని దేశస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదే అని చంద్రబాబు అన్నారు.

జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్‌ విచారణ తుది దశకు చేరిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని చంద్రబాబు చెప్పారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలనే ఇప్పటివరకు దీనిమీద మాట్లాడలేదని చెప్పారు చంద్రబాబు.


సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు:

  • వాణిజ్య పంటల రైతులకు మెరుగైన సబ్సిడీ, రాయితీలు ఇచ్చేలా కేంద్రాన్ని కోరాలని పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

  • అమరావతి క్వాంటమ్ వ్యాలీతో పాటు రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కేంద్ర సాయం కోరాలని నిర్ణయం

  • రాష్ట్ర రాజధానిగా ఏకైక రాజధాని అమరావతి అనే అంశానికి చట్టబద్ధత కల్పించే అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది..

  • ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది

  • రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ భారత్ గౌరవ్ రైళ్లు పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచన.

  • జలజీవన్ మిషన్ పెండింగ్ అంశాలపైనా కేంద్రాన్ని కోరాలని నిర్ణయం

  • పెద్ద అంశాలతో పాటు చిన్న చిన్న అంశాలపైనా దృష్టి పెట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని సీఎం ఆదేశం

  • ఏడాదిలో కేంద్రం నుంచి సాధించిన విజయాలతో పాటు వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన వాటిపై సీఎం దిశానిర్దేశం

  • ఆపరేషన్ సింధూర్ ను పార్లమెంట్ వేదికపై ప్రస్తావించాలని నిర్ణయించాం

  • ఎమర్జన్సీకి 50ఏళ్లు పూర్తైన అంశం కూడా పార్లమెంట్ లో ప్రస్తావించాలని సూచన.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 09:10 PM