AP Degree Admissions: డిగ్రీ అడ్మిషన్లపై సమాచారం లేదు
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:44 AM
బీబీఏ, బీసీఏ కోర్సులు అందించే అన్ని కాలేజీల అనుమతుల వివరాలను ఉన్నత విద్యామండలికి పంపినట్టు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి.గణే్‌షకుమార్ వెల్లడించారు..
ఆంధ్రజ్యోతి కథనానికి సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ వివరణ
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): బీబీఏ, బీసీఏ కోర్సులు అందించే అన్ని కాలేజీల అనుమతుల వివరాలను ఉన్నత విద్యామండలికి పంపినట్టు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి.గణే్‌షకుమార్ వెల్లడించారు. తొలుత 293 కాలేజీల వివరాలను ఈ నెల 19న పంపించామని, ఇప్పుడు మరో 105 కాలేజీల వివరాలు పంపామన్నారు. అయితే వాటిలో 48 కాలేజీలకు యూనివర్సిటీల అఫిలియేషన్లు లేవని పేర్కొన్నారు. ‘ఇంజనీరింగ్ కాలేజీల్లో నో డిగ్రీ’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. సకాలంలో ఉన్నత విద్యామండలికి వివరాలు పంపలేదనడం సరికాదని, వాస్తవానికి అడ్మిషన్ల నోటిఫికేషన్, షెడ్యూలుపై తమకు సమాచారమే లేదని వివరించారు. రెండు విడతల్లో అన్ని కాలేజీల సమాచారం మండలికి పంపామన్నారు. కాగా ఉన్నత విద్యాశాఖలో తలెత్తిన సమన్వయలోపంతో మొదట విద్యార్థులకు అన్ని కాలేజీలు కనిపించలేదు. 105 కాలేజీలకు రెండో విడతలో పంపినట్టు సాంకేతిక విద్యా శాఖే చెబుతోంది. అంతకంటే ముందే డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే బీబీఏ, బీసీఏ కోర్సులకు అనుమతులను ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకురావడంతో ఈ సమస్య తలెత్తుతోంది.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..