TCS Visakhapatnam: టీసీఎస్ కోసం ఐటీ భవనాలు సిద్ధం
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:28 AM
విశాఖపట్నంలో టీసీఎస్ కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. మిలీనియం టవర్స్‌ను డీనోటిఫై చేసేందుకు కేంద్ర బోర్డు అంగీకరించడంతో త్వరలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
విశాఖలో తక్షణం కార్యకలాపాల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్
సెజ్ నుంచి మిలీనియం టవర్స్ డీనోటిఫైకి బోర్డు ఆఫ్ అప్రూవల్స్ అంగీకారం
గతంలో టీసీఎ్‌సకు 2.08 లక్షల చ.అ. కేటాయింపు
అక్కడి నుంచే ఇప్పుడు ఆపరేషన్స్‌కు చాన్స్
ఇంటీరియర్స్ పనులే తరువాయి
విశాఖపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): విశాఖలో తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించడానికి టీసీఎ్‌సకు మార్గం సుగమమైంది. రుషికొండలోని సెజ్ నుంచి మిలీనియం టవర్లను డీనోటిఫై చేయడానికి ఢిల్లీలోని బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ (బీఓఏ) అంగీకరించింది. సీఎం చంద్రబాబు ‘టాటా సన్స్’ చైర్మన్ చంద్రశేఖరన్‌తో వరుస భేటీలు, ఐటీ మంత్రి లోకేశ్ ప్రయత్నాల మీదట టీసీఎస్ విశాఖ రావడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. టాటా సంస్థ సొంత క్యాంపస్ నిర్మించుకోవడానికి రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నంబర్-3పై 21.6 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. భూమి ఇవ్వడానికంటే ముందే కార్యకలాపాల ప్రారంభానికి మిలీనియం టవర్స్‌లో 2.08 లక్షల చదరపు అడుగులు కేటాయించారు. ఈ ఐటీ పార్కు ‘ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)’ పరిధిలో ఉంది. నిబంధనల ప్రకారం ఇక్కడ పనిచేసే కంపెనీలు విదేశాలకు మాత్రమే ఉత్పత్తులు ఎగుమతి చేయాలి. దేశీయంగా సేవల కోసం ఈ భవనాలను ఉపయోగించుకోవాలని టీసీఎస్ భావించి.. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ భవనాన్ని డీనోటిఫై చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపారు. దీనికి బీఓఏ ఆమోదం తెలిపిన విషయాన్ని టీసీఎ్‌సకు తెలియజేశామని, వారు ఇంటీరియర్ పనులు చేయించుకొని, మంచి ముహూర్తం చూసుకుని కార్యకలాపాలు ప్రారంభించడమే మిగిలి ఉందని ఏపీఐఐసీ అధికారి చెప్పారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..