Share News

Supreme Court: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో మోహన్‌బాబుకు సుప్రీంలో చుక్కెదురు

ABN , Publish Date - May 01 , 2025 | 05:46 AM

ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మే 2న తిరుపతి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2019లో ఎలక్టరల్ కోడ్‌ ఉల్లంఘనపై కేసు నమోదు అయినప్పుడు మోహన్‌బాబు, ఆయన కుటుంబం ధర్నాకు దిగారు. 2021లో కోర్టులో చార్జిషీట్‌ సమర్పించబడింది.

Supreme Court: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో మోహన్‌బాబుకు సుప్రీంలో చుక్కెదురు

రేపు తిరుపతి కోర్టులో హాజరవ్వాల్సిందేనని ఆదేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినిమానటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలన్న ఆయన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. మే 2న తప్పనిసరిగా తిరుపతి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు కావలసిందేనని తేల్చిచెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ 2019లో తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు కుటుంబం ధర్నాకు దిగింది. అప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో.. మోహన్‌బాబుతోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని చంద్రగిరి పోలీసులు పేర్కొన్నారు. 2021లో కోర్టులో చార్జిషీటు కూడా సమర్పించారు. అయితే ఆ కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 30న మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నిఖిల్‌ గోయల్‌ వాదనలు వినిపించారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:53 AM