Share News

ప్రవాసాంధ్రులకు తోడ్పాటు: కొండపల్లి

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:59 AM

తాడేపల్లిలో నిర్వహించిన ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రవాసాంధ్రుల సంక్షేమంపై దృష్టి సారించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి అండగా నిలవాలని సూచించారు.

ప్రవాసాంధ్రులకు తోడ్పాటు: కొండపల్లి

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం తాడేపల్లిలో నిర్వహించిన ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశానికి మంత్రి కొండపల్లి అధ్యక్షత వహించారు. అమరావతిలో నిర్మించతలపెట్టిన ఐకానిక్‌ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి అండగా నిలబడటంతోపాటు రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబాలకు ఽభరోసానిచ్చే దిశగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సంస్థ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆ సంస్థ సీఈవో హేమలత, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్లు వేమూరి రవికుమార్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 06:01 AM