Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:47 AM
సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి సుగాలి పార్వతి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వికలాంగురాలినైన తాను..
సుగాలి పార్వతి
విజయవాడ(గాంధీనగర్), ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి సుగాలి పార్వతి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వికలాంగురాలినైన తాను ఎనిమిదేళుగ్లా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే నిందితులకు శిక్షపడేలా చేసి న్యాయం చేస్తానని పవన్ కల్యాణ్ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఆయన స్పందించాలి. లేదంటే జనసేన పార్టీ కార్యాలయం ఎదుట అమరణ నిరాహారదీక్ష’ అని పార్వతి చెప్పారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..