Share News

APCOB Chairman: సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:38 AM

సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆప్కాబ్‌ చెర్మన్‌ గన్ని వీరాంజనేయులు అన్నారు.

APCOB Chairman: సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి

మచిలీపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆప్కాబ్‌ చెర్మన్‌ గన్ని వీరాంజనేయులు అన్నారు. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీబీ)లో శనివారం అంతర్జాతీయ సహకార సంవత్సరం-2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ సహకార రంగంపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుని, స్థిరమైన, సమగ్రతతో కూడిన వ్యవస్థను రూపొందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో వాణిజ్య బ్యాంకులతో పోల్చుకుంటే సహకార సంఘాలు నాల్గో స్థానంలో ఉన్నాయన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 04:39 AM