Technical Education : ఎల్లుండి నుంచి రాష్ట్రస్థాయి పాలీ టెక్‌ఫెస్ట్
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:56 AM
రాష్ట్రస్థాయి పాలీ టెక్‌ఫె్‌స్టను ఈనెల ఆరు నుంచి ఎనిమిదో తేదీవరకు విజయవాడలో నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి పాలీ టెక్‌ఫె్‌స్టను ఈనెల ఆరు నుంచి ఎనిమిదో తేదీవరకు విజయవాడలో నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పాలిటెక్నిక్ విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను ఇందులో ప్రదర్శిస్తారని పేర్కొంది. గత ఏడాది డిసెంబరులో జిల్లాలవారీగా పాలీ టెక్‌ఫెస్ట్ నిర్వహించగా, 1302 ప్రాజెక్టులు ప్రదర్శించారని, వాటిలో 249 రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికయ్యాయని ఆ ప్రకటనలో వివరించింది. రాష్ట్రస్థాయి ఫెస్ట్‌లో వాటిని ప్రదర్శిస్తారని, న్యాయ నిర్ణేతలు బహుమతులకు ఎంపికైన వాటిని ప్రదర్శిస్తారని తెలిపింది. రాష్ట్రస్థాయిలో మొదటి విజేతకు రూ.లక్ష, రెండో విజేతకు రూ.50వేలు, ప్రోత్సాహక బహుమతి కింద ప్రతి విభాగానికి ఒకటి చొప్పున ఎంపిక చేసి రూ.25వేలు నగదు బహుమతి అందజేస్తారని పేర్కొంది. ప్రాంతీయ స్థాయిలో మొదటి విజేతకు రూ.25వేలు, రెండో విజేతకు రూ.10వేలు ఇస్తారని తెలిపింది.