Share News

'Tandel' : మత్స్యలేశంలో వైసీపీ రాజకీయ చిచ్చు: ‘తండేల్‌’ రామారావు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:37 AM

'Tandel' : కల్మషం లేని మత్స్యకారుల్లో విద్వేషం సృష్టించి.. వారి కుటుంబాల్లో వైసీపీ నాయకులు రాజకీయ చిచ్చు పెడుతున్నారని ‘తండేల్‌ ’సినిమా కథకు మూలకారకుడైన గనగళ్ల రామారావు విమర్శించారు.

 'Tandel' : మత్స్యలేశంలో వైసీపీ రాజకీయ చిచ్చు: ‘తండేల్‌’ రామారావు
సమావేశంలో మాట్లాడుతున్న రామారావు తదితరులు

శ్రీకాకుళం క్రైం,ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): కల్మషం లేని మత్స్యకారుల్లో విద్వేషం సృష్టించి.. వారి కుటుంబాల్లో వైసీపీ నాయకులు రాజకీయ చిచ్చు పెడుతున్నారని ‘తండేల్‌ ’సినిమా కథకు మూలకారకుడైన గనగళ్ల రామారావు విమర్శించారు. స్థానిక ఎన్‌జీఓహోమ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామారావు, అతని భార్య నూకమ్మ మాట్లాడుతూ డి.మత్య్సలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్యకారుల కష్టాలను ‘తండేల్‌’ సినిమాలో చూపించారన్నారు. చిత్ర రచయిత 22 మందితో మాట్లాడారని, అందరికీ రూ.45 వేల వంతున ఇచ్చి కఽథ తీసుకుంటున్నట్లు ఒప్పందం చేసుకున్నారన్నారు. ఒక్క తండేల్‌ పాత్రనే4 కీలకంగా చూపిస్తామని ఆ రోజే చెప్పారని వివరించారు. పక్క జిల్లా వారికే తెలియని డి.మత్యలేశం గ్రామాన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేశారని అన్నారు. గ్రామంలోని కొంతమంది వైసీపీ నాయకులు సినిమా ను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి చెందిన మూగి రామారావు, మూగి గురుమూర్తులు మత్స్యకారుల మనసులో విషం నింపి.. సొంత కుటుంబంలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నిర్మాత తనకు రూ.కోటి విలు వైన ఇల్లు, రూ.20 లక్షల నగదు, 10 తులాల బంగారం ఇచ్చారం టూ పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు. 22 మంది మత్స్య కారులతో పాటే తమకు రూ.90 వేల చెక్‌ ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో సర్పంచుగా తనను పోటీ చేయనీయకుండా ఉంచా లనే ఈ కుట్ర పన్నారని రామారావు ఆరోపించారు. ఈ సమావేశంలో కె.శిరీష, లక్ష్మణరావు, సన్యాసిరావు, మణి, లక్షుమమ్మ, సీతమ్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:37 AM