Share News

Minister Satyakumar: ఆర్‌ఎంపీల సమస్యలపై ప్రత్యేక కమిటీ

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:36 AM

కొంత కాలంగా ఆర్‌ఎంపీలు చేస్తున్న డిమాండ్ల పరిశీలనకు కమిటీని వేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు...

Minister Satyakumar: ఆర్‌ఎంపీల సమస్యలపై ప్రత్యేక కమిటీ

  • ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా ఆర్‌ఎంపీలు చేస్తున్న డిమాండ్ల పరిశీలనకు కమిటీని వేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఆర్‌ఎంపీలు, ఆశా వర్కర్లు, ఆంధ్రప్రదేశ్‌ దేశీయ వైద్య సంఘం డిమాండ్లు, సూచలనపై బుధవారం సచివాలయంలో మంత్రితో టీడీసీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు టి.డి.జనార్దన్‌ భేటీ అయ్యారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఆర్‌ఎంపీలు తమకు వృత్తి రక్షణ, శిక్షణ అందించాలని కోరుతున్నారు. రూరల్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌గా సేవలందించాల్సిన ఆర్‌ఎంపీలు రిజిస్టర్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లమని, డాక్టర్లమని చెప్పుకుంటూ ప్రాథమిక చికిత్సా కేంద్రాలుగా బోర్డులు పెట్టుకోవడంపై కొన్ని అభ్యంతారాలొచ్చాయని స్పెషల్‌ సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబు వివరించారు..

బర్లీ పొగాకు సేకరణకు రూ.273 కోట్లు

రాష్ట్రంలో 2024-25 రబీ మార్కెట్‌ సీజన్‌లో ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా 20 మిలియన్‌ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకు సేకరణకు ప్రభుత్వం రూ.273.17కోట్లు మం జూరు చేసింది. ఇందులో రైతులకు కిలో కు రూ.120 చొప్పున లెక్కకట్టి రూ.240కోట్లు, యాదృచ్ఛిక ఖర్చుల కింద రూ.33.17కోట్లు మంజూరు చేసి, ముందస్తుగా రూ.100కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులిచ్చింది. హెచ్‌డీఆర్‌ రకం పొగాకుకు కిలో రూ.120, హెచ్‌డీఎం రకం రూ.90, హెచ్‌డీఎక్స్‌ రకం రూ.60గా ధర నిర్ణయించింది. హెచ్‌డీ బర్లీ పొగాకు సేకరణకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Updated Date - Jul 10 , 2025 | 05:36 AM