SPDCL: ఎస్పీడీసీఎల్‌లో అవినీతి వల్లే చార్జీల పెంపు: మాజీ ఇంటెలిజెన్స్ డీజీ
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:10 AM
కర్మను తప్పించుకోకగలమోమే గానీ, విద్యుత్ బిల్లుల మొతను తప్పించుకోలేమని.. మన బిడ్డలైనా కట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఒక రూపాయి వస్తువును ఎవడో మూడు రూపాయలకు కొని అవినీతికి పాల్పడితే వినియోగ దారుడు ఎందుకు భారం మోయాలి? అని ప్రశ్నించారు.
తిరుపతి, అక్టోబర్ 23: ఎస్పీడీసీఎల్‌లో అవినీతి వల్లే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని మాజీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తిరుపతితో ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో విద్యుత్ సమస్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్మను తప్పించుకోకగలమోమే గానీ, విద్యుత్ బిల్లుల మొతను తప్పించుకోలేమని.. మన బిడ్డలైనా కట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఒక రూపాయి వస్తువును ఎవడో మూడు రూపాయలకు కొని అవినీతికి పాల్పడితే వినియోగ దారుడు ఎందుకు భారం మోయాలి? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం నియమించిన సంతోష్ రావు హయంలోనే ఈ అవినీతి మొదలైందని ఆరోపించారు. ఆయన్ను ఇప్పటి వరకు ఎక్స్ టెన్షన్ లపైన నడిపించి, ఇప్పటికి బదిలీ చేశారని అన్నారు. ఆయన అవినీతిపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరామని.. అయితే ఆర్టీఐ ఆ వివరాలను ఇవ్వలేదని స్పష్టం చేశారు. 12 సార్లు మొదటి అపీళ్లు, రెండో అపీళ్లు కూడా చేశామని.. అయినా వివరాలు ఇవ్వలేదన్నారు. 2023 నుంచి ఎస్పీడీసీఎల్ లో అవినీతి కట్టుదిట్టంగా వ్యవస్థీకృతం అయిందన్నారు. కంపెనీలు అధికారులు అందరూ కలిసి అవినీతి సొమ్మును పంచుకున్నారని ఆరోపించారు.
అవినీతిని ఆపితే తప్ప విద్యుత్ చార్జీలు తగ్గవని స్పష్టం చేశారు. ప్రజల్లో దీనిపై చర్చ జరిగి, దిద్దుబాటు ఉండాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. తాము బట్టబయలు చేయకుంటే వైరస్ లా మిగిలిన డి.సి.ఎల్ లకు కూడా పాకేదన్నారు. సమగ్రమైన వివరాలతో అన్ని రాజకీయ పక్షాలతో తిరుపతి ప్రెస్ క్లబ్ లో రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Narayanarao Death Mystery: నారాయణరావు మృతి.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
Lokesh Australia Visit: క్రీడా రంగంలో ఏపీ - ఆస్ట్రేలియా జట్టుకు లోకేష్ ప్రయత్నం