Smiles All Around As Farmers: అన్నదాత కళ్లల్లో మెరుపులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:55 AM
అన్నదాత సుఖీభవ నగదు సాయంలోని మెరుపు రైతుల కళ్లలో కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ
సుఖీభవ సాయం కోసం బ్యాంకులకు..
ఉత్సాహంగా డ్రా చేసుకున్న రైతులు
శింగనమల, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ‘అన్నదాత సుఖీభవ’ నగదు సాయంలోని మెరుపు రైతుల కళ్లలో కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసిన ఈ పథకం సొమ్మును డ్రా చేసుకోవడానికి వచ్చిన రైతులు బ్యాంకుల వద్ద ఆనందంగా కనిపించారు. శనివారం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. అయితే, మరుసటి రోజు ఆదివారం కావడంతో నగదు తీసుకోలేకపోయారు. దీంతో సోమవారం అనంతపురం జిల్లాలోని బ్యాంకులకు తరలివచ్చిన రైతులతో సందడి వాతావరణం నెలకొంది. శింగనమల మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు, సలకం చెరువులోని స్టేట్ బ్యాంకులో వందలాది మంది రైతులు డబ్బులు డ్రా చేసుకున్నారు. నగదు లెక్కపెట్టుకుంటూ, పరస్పరం పలకరించుకుంటూ ఉత్సాహంగా కనిపించారు.
రైతు బిడ్డ చంద్రబాబు..
‘‘ఎన్నికలప్పుడు రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు మాటిచ్చారు. ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద చెల్లిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నెరవేర్చి రైతులకు అండగా నిలిచారు. చంద్రబాబు రైతు బిడ్డ అనిపించుకున్నాడు.’’
- చిన్న ఎర్రినాగప్ప, శివపురం, అనంతపురం
రైతులను మరవని నేత..
‘‘రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉన్నా చంద్రబాబు రైతులను మరిచిపోలేదు. మా కుటుంబాల్లో ఆనందం నింపడానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారు. మొదటి విడత మాకు రూ.7 వేలు వచ్చింది. - అంజినమ్మ, సి.బండమీదపల్లి, అనంతపురం
విత్తనాలకు చేసిన అప్పు తీరుస్తా..
‘‘పంట సాగు కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వం డబ్బులిచ్చింది. విత్తనాల కోసం మరో రైతు వద్ద అప్పు చేశాను. అన్నదాత సుఖీభవ డబ్బులు ఖాతాలో పడినట్టు శనివారం మెసేజ్ వచ్చింది. ఆ డబ్బులతో విత్తనాల కోసం చేసిన అప్పు తీరుస్తా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చారు. చాలా సంతోషంగా ఉంది.’’
- ఆదినారాయణ, సోదనపల్లి, అనంతపురం
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News