Prakasham District : ఇంట్లోవాళ్లే చంపేశారు!!
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:13 AM
ఓ యువకుడిని ముక్కలుగా నరికి గోతాల్లో కట్టి పంట కాలువ పక్కన పడేసిన ఘటన ప్రకాశం జిల్లా కంభంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

తల, మొండెం ఒక సంచిలో..కాళ్లూ, చేతులు మరో సంచిలో..కాలువలో గిరాటు
కంభంలో యువకుడి దారుణ హత్య
కంభం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఓ యువకుడిని ముక్కలుగా నరికి గోతాల్లో కట్టి పంట కాలువ పక్కన పడేసిన ఘటన ప్రకాశం జిల్లా కంభంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కంభం పట్టణం మేదరవీధికి చెందిన కందం సుబ్బారావు, లక్ష్మీదేవి దంపతులకు నలుగురు కుమారులు. వీరిలో మూడో కుమారుడైన శ్యాంప్రసాద్(34)ఆటోడ్రైవర్‌గా ఉం టూ కూలి పనులూ చేస్తున్నాడు. అవివాహితుడు. సుబ్బారావు నాలుగేళ్ల క్రితమేమృతిచెందాడు. శ్యాంప్రసాద్‌కు మిగిలిన ముగ్గురు అన్నదమ్ములతో తరచూ ఘర్షణ జరిగేది. ఈ నేపథ్యంలోనే గురువారం తెల్లవారుజామున శ్యాంప్రసాద్ హత్య ఇంటిలోనే జరిగింది. అతడి శరీరాన్ని ముక్కలుగా నరికి తల, మొండెం ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కారు. కాళ్లూ, చేతులు మరో సంచిలో ఉంచి గురువారం రాత్రి ఇంటి సమీపంలోని పంట కాలువ వద్ద పడేశారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హత్య విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న కంభం సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ నరసింహరావు సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహం ఉన్న సంచులను పోలీసులు పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పోలీసుస్టేషన్‌కు తరలించినటు ్లవివరాలు రాబట్టి, వారే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మద్యానికి బానిసైన శ్యాంప్రసాద్.. కుటుంబ సభ్యురాలైన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇంట్లోని వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. అయితే, ఇంకా కేసుదర్యాప్తులో ఉందని, త్వరలో పూర్తి వివరా లు వెల్లడిస్తామని డీఎస్పీ నాగరాజు తెలిపారు.