దారుణం.. మద్యం మత్తులో 12 ఏళ్ల కూతురిపై అత్యాచారం
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:26 PM
ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామంలో మద్యం మత్తులో తన 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 26: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలపైనే కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వావి వరుసలు లేకుండా మృగాళ్ల మారుతున్నారు. తమకు కావలసిన శారీరక సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మద్యం మత్తులో 12 ఏళ్ల కూతురిపైనే అత్యాచారం చేసిన దారుణ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామంలో మద్యం మత్తులో తన 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకొచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు, బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. దీంతో ఆ బాలికను తల్లి ఇంటికి తీసుకొచ్చింది. తన భర్త కూతురి ఒంటిపై చేయి వేసి మాట్లాడటాన్ని తల్లి గుర్తుకుతెచ్చుకుంది. ఇదే విషయాన్నీ కుటుంబ సభ్యులతో కలిసి బాలికను ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
Savitha On Cyclone: మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి మంత్రి సవిత కీలక ఆదేశాలు