Share News

YCP Jgan: జగన్‌ యాత్రలను నిషేధించాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:16 AM

రాష్ట్రంలో జగన్‌ చేస్తున్న యాత్రలు కేవలం బలప్రదర్శనలు మాత్రమేనని.. వేలమందితో ఆయన చేస్తున్న యాత్రలను నిషేధించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

YCP Jgan: జగన్‌ యాత్రలను నిషేధించాలి

ఆయనకు సమస్యలు అక్కర్లేదు

బలప్రదర్శనలే వైసీపీ అజెండా పోలీసులనూ కొంటున్నారా?: షర్మిల

  • బలప్రదర్శనలే వైసీపీ అజెండా

  • పోలీసులనూ జగన్‌ కొంటున్నారా?

  • నేటికీ బీజేపీకి దత్త పుత్రుడే

  • ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలు

గుంటూరు/చీరాల, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జగన్‌ చేస్తున్న యాత్రలు కేవలం బలప్రదర్శనలు మాత్రమేనని.. వేలమందితో ఆయన చేస్తున్న యాత్రలను నిషేధించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. గుంటూరులో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. ఇటీవల మాజీ సీఎం జగన్‌ రెంటపాళ్ల పర్యటనలో జరిగిన సింగ య్య మృతిపై స్పందిస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. కారు కింద పడి న సింగయ్య మృతికి జగన్‌ నిర్లక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యం కూడా ఉం దన్నారు.


అనుమతి ఇచ్చింది కేవలం 5 వాహనాలు, 100 మందికి మాత్రమేనని వేల మందితో జగన్‌రెడ్డి యాత్రలు చేస్తుంటే పోలీసుల ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘జనాన్ని కొన్నట్టు పోలీసులను కూడా కొంటున్నాడో అర్ధం కావడం లేదు.’’ అని ఆరోపించారు. ‘‘వేల మందితో యాత్రలా వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.. హౌస్‌ అరెస్టు చేయొచ్చు కదా.. నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది.’’ అని ప్రశ్నించారు. తాము నిరసన చేస్తామంటే హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనలో మంచి చేశామని చంద్రబాబు చెప్పుకోవడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మంచి కాదు ఓట్లు వేసిన ప్రజల్ని ముంచారని మండిపడ్డారు. ఏడాదిలో రూ.లక్షా 50 వేల కోట్లు అప్పులు చేయడం మంచిదా? అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో జగన్‌రెడ్డి విద్యుత్‌ చార్జీల పేరుతో రూ.32 వేల కోట్లు విద్యుత్‌ బిల్లుల భారం మోపితే, ఏడాదిలో మీరు రూ.17 వేల కోట్లు విద్యుత్‌ బిల్లుల భారం మోపడం మంచిదా? అని విమర్శించారు. వైఎ్‌సఆర్‌ పథకాలని.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పీ-4 ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీలు బీజేపీకి తొత్తులుగా మారాయని మండిపడ్డారు. నేటికీ జగన్‌ బీజేపీకి దత్తపుత్రుడేనని విమర్శించారు. బీజేపీకి ఎదురొడ్డి నిలిచేది, ప్రశ్నించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.


తండ్రి ఆశయాలకు తూట్లు

జగన్‌ జనాలను నిలువునా మోసగించాడని, తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచాడని షర్మిల విమర్శించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్‌ మద్దతుదారులు సానుభూతితో అధికారం చేపట్టిన జగన్‌.. మోదీకి దత్తపుత్రుడిలా వ్యవహరించాడన్నారు. వైసీపీ హయాంలో ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారని విమర్శించారు. జగన్‌ మోదీకు గులాంగిరీ చేశారని వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజలకోసం పనిచేసేది కాంగ్రెస్‌ పార్టీనేనని తెలిపారు. కాంగ్రెస్‌ వస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 03:16 AM