Oil Palm Cultivation: ఆయిల్‌పామ్ కంపెనీలకు మరో 7 మండలాల కేటాయింపు
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:59 AM
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్‌పామ్ నోటిఫికేషన్ మేరకు.. ..
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్‌పామ్ నోటిఫికేషన్ మేరకు.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని మరో ఏడు మండలాలను ఆయిల్‌పామ్ కంపెనీలకు తిరిగి కేటాయించడానికి ఉద్యానశాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం అనుమతించింది. బాపట్ల జిల్లా బల్లికురవ, అద్దంకి, సంత మాగులూరు, నెల్లూరు జిల్లా గుడ్లూరు, లింగసముద్రం, తిరుపతి జిల్లా నారాయణపురం, నాగులాపురం మండలాలను వివిధ ఆయిల్‌పామ్ కంపెనీలకు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..