Share News

Nellore: ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి 4 బీబీఎస్‌ అవార్డులు

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:45 AM

నెల్లూరులోని ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు ఫోరం ఆఫ్‌ బిహేవియర్‌ సేఫ్టీ నుంచి నాలుగు ప్రతిష్ఠాత్మక బీబీఎస్‌ అవార్డులు దక్కాయి.

Nellore: ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి 4 బీబీఎస్‌ అవార్డులు

ముత్తుకూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిదారులైన నెల్లూరులోని ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు ఫోరం ఆఫ్‌ బిహేవియర్‌ సేఫ్టీ నుంచి నాలుగు ప్రతిష్ఠాత్మక బీబీఎస్‌ అవార్డులు దక్కాయి. ముంబైలోని ఐఐఎంతో సంయుక్తంగా నిర్వహించిన 9వ వార్షిక జాతీయ బీబీఎస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డులు ప్రదానం చేశారు. బిహేవియర్‌ బేస్డ్‌ సేఫ్టీ విధానం అమలులో కృషికి కంపెనీ సీఈవో రాఘవ్‌ త్రివేదికి ‘లీడర్‌షిప్‌ అవార్డు’, కంపెనీ భద్రతా కార్యక్రమాలకుగాను ఆపరేషన్స్‌ ఏజీఎం నిజి జేమ్స్‌, ఆపరేషన్స్‌ సీనియర్‌ ఇంజనీర్‌ వెంకటరామ్‌జీ ఉత్తమ బీబీఎస్‌ అబ్జర్వర్‌ అవార్డులను అందుకున్నారు. వరుసగా రెండో ఏడాది అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని త్రివేది అన్నారు.

Updated Date - Feb 04 , 2025 | 04:45 AM