Share News

Thalliki Vandanam: 10న రెండో విడత తల్లికి వందనం

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:48 AM

రెండో విడత తల్లికి వందనం నగదును ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Thalliki Vandanam: 10న రెండో విడత తల్లికి వందనం
Thalliki Vandanam Scheme

  • ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు జమ

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): రెండో విడత తల్లికి వందనం నగదును ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలుచేశారు. రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరిన వారికి జూలై 5న నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది.


కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈనెల 10న మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటివరకూ ఒకటో తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్‌ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Jul 03 , 2025 | 09:00 AM