Share News

heatwave: భగ్గుమన్న భానుడు రాష్ట్రవ్యాప్తంగా ఠారెత్తించిన ఎండలు

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:04 AM

రోహిణి కార్తె మొదలుకాకముందే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ఉక్కిరిబిక్కిర చేస్తున్నాయి. దొర్నిపాడులో 43.9 డిగ్రీలు తాకగా, రాష్ట్రవ్యాప్తంగా 195 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

heatwave: భగ్గుమన్న భానుడు రాష్ట్రవ్యాప్తంగా ఠారెత్తించిన ఎండలు

అనేక చోట్ల 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అత్యధికంగా నంద్యాల జిల్లాలో 43.9, కడపలో 43.8 డిగ్రీలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రోహిణి రాకముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వడగాల్పులు అనూహ్యంగా పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నమోదుకానంత అత్యధిక ఉష్ణోగ్రతలు మంగళవారం పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా దొర్నిపాడులో 43.9, కడప జిల్లా సిద్ధవటంలో 43.8, కడప నగరంలో 43.8, కర్నూలులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 43.76, కోసిగి మండలం సాతనూరులో 43.5, పాణ్యం మండలం గోనవరంలో 43.34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్నమయ్య జిల్లా వతలూరులో 42.9, ప్రకాశం జిల్లా పెద్దడోర్నాలలో 42.8, పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.4, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 195 ప్రాంతాల్లో 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 5 మండలాల్లో తీవ్రంగా, 18 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. బుధ, గురువారాల్లో ఎక్కువ మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


Also Read:

పాపం.. చచ్చిపోతాడని తెలీదు..

కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..

చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 05:05 AM