Borugadda Anil: ‘ఆస్పత్రి’ సాకు ఉత్తిదే
ABN , Publish Date - Mar 10 , 2025 | 02:48 AM
తన తల్లికి చికిత్స పేరిట హైకోర్టులో బెయిల్ గడువు పొడిగించుకున్న అనిల్ అసలు ఆసుపత్రికే వెళ్లలేదు. అనిల్ తల్లి చికి త్స చేయించుకున్న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి అతడు వెళ్లలేదని పోలీసులు ఆధారాలు సేకరించారు.
చెన్నై అపోలోకు వెళ్లని బోరుగడ్డ
కూతుళ్లతో వెళ్లిన తల్లి పద్మావతి
ఆరా తీసిన అనంతపురం పోలీసులు
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తింపు
నేడో, రేపో హైకోర్టులో కౌంటర్
తల్లికి చికిత్స చేయించాలంటూ
హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న అనిల్
‘ఆసుపత్రి’ సాకు ఉత్తిదే
చెన్నై అపోలోకు వెళ్లని బోరుగడ్డ.. కూతుళ్లతో వెళ్లిన తల్లి పద్మావతి
అనంతపురం క్రైం, మార్చి9(ఆంధ్రజ్యోతి): మధ్యంతర బెయిల్‌పై వచ్చి అజ్ఞాతంలో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో అసలు విషయం బయటపడింది. తన తల్లికి చికిత్స పేరిట హైకోర్టులో బెయిల్ గడువు పొడిగించుకున్న అనిల్ అసలు ఆసుపత్రికే వెళ్లలేదు. అనిల్ తల్లి చికి త్స చేయించుకున్న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి అతడు వెళ్లలేదని పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు సోమ, మంగళవారాల్లో కోర్టులో ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. హై కోర్టుకు బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ ఫోర్జరీ అని తేలిన సంగతి తెలిసిందే. దీంతో అజ్ఞాతంలో ఉన్న అనిల్ కోసం పోలీసులు గాలించడంతో శనివారం అతడు ఓ వీడియో విడుదల చేశాడు. ఫోర్జరీ చేసిన విషయం గురించి మాట్లాడకుండా తల్లికి సర్జరీ కోసం బెయిల్‌పై వచ్చినట్టు మొసలి కన్నీరు కారుస్తూ, కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ‘ఆసుపత్రి’ సాకుపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కూపీ లాగా రు. పోలీసులను, కోర్టును త ప్పుదోవ పట్టించినట్టు తేలింది. అనిల్ తన తల్లికి ఊపిరితిత్తుల సమస్య ఉందంటూ నయం చేయించడానికి హైకోర్టులో ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ పొందాడు.
గడువులోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. అనంతరం తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఈ నెల 1న పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఆధారంగా ఈ నెల 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను కోర్టు పొడిగించింది. కాగా బోరుగడ్డ తన తల్లికి చికిత్స పేరి ట సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని గుంటూరు పోలీసులు నిర్ధారించారు.అనంతపురం నాలుగో పట్ణణ పోలీసులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆరా తీశారు. బోరుగడ్డ తల్లి పద్మావతి ఆ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని గత నెల 23న డిశ్చార్జి అయ్యారు. ఆమె తన కుమార్తెలతో కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 2న చెకప్ కోసం మరోసారి వెళ్లారు. పోలీసుల విచారణలో ఈ రెండు సందర్భాల్లోనూ బోరుగడ్డ ఆసుపత్రికి వెళ్లలేదని తెలిసింది. మరి ఆ సమయంలో అనిల్ ఎక్కడికెళ్లాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, పోలీసు లు బోరుగడ్డ కదలికలపై ప్రత్యేక నిఘా వేశారు. ఓ పోలీసు బృందం తెలంగాణకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే బోరుగడ్డ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 111 బీఎన్‌ఎ్‌స-2023 తనకు వర్తించదంటూ బోరుగడ్డ బెయిల్ కోసం వెళ్లడాన్ని పోలీసులు సీరియ్‌సగా పరిగణిస్తున్నారు.
Read more :
Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
For AndhraPradesh News And Telugu News