Srikakulam: అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:59 AM
అతని భార్య కున్నికు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు వారి త్రి చక్రవాహనంపై సోంపేట నుంచి మందస వస్తుండగా.. ముకుందపురం వద్ద ఎలుగుబంటి అడ్డుగా వచ్చింది.
దివ్యాంగుడి మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
హరిపురం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా మందస మండలం ముకుందపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందసకు చెందిన దివ్యాంగుడు తామాడ జయరాం(40) మృతిచెందగా.. అతని భార్య కున్నికు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు వారి త్రి చక్రవాహనంపై సోంపేట నుంచి మందస వస్తుండగా.. ముకుందపురం వద్ద ఎలుగుబంటి అడ్డుగా వచ్చింది. దీన్ని తప్పించబోయిన జయరాం వాహనాన్ని అదుపులోకి తెచ్చుకోలేకపోయాడు. దీంతో వాహనం రోడ్డుపైనే బోల్తాపడింది. జయరాం తలకు బలమైన గాయమవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్యకు కాళ్లు, ముఖంపై గాయాలయ్యాయి. జయరాం కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.