PADDY: వరి రైతులకు తుఫాను భయం
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:55 PM
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాషా్ట్ర ల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచిస్తోం ది. దీంతో వరి రైతుల్లో తుఫాను భయం చు ట్టుకుంది. గాండ్లపెంట మండల వ్యాప్తంగా 14 పంచా యతీల్లో 813 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి సాగుకు ఎకరాకు సు మారు రూ. 20వేలు వరకు ఖర్చు చేశారు. ఈ సీజనలో చీడపీడల నివారణ కూడా ఎంతో కష్టతరం గా మారింది.
గాండ్లపెంట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాషా్ట్ర ల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచిస్తోం ది. దీంతో వరి రైతుల్లో తుఫాను భయం చు ట్టుకుంది. గాండ్లపెంట మండల వ్యాప్తంగా 14 పంచా యతీల్లో 813 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి సాగుకు ఎకరాకు సు మారు రూ. 20వేలు వరకు ఖర్చు చేశారు. ఈ సీజనలో చీడపీడల నివారణ కూడా ఎంతో కష్టతరం గా మారింది. అయినా తిండి గింజలు పండించుకో వాల ని, పశు గ్రాసం దొరుకుతుందని రైతులు ఆశపడ్డారు. ఇ ప్పటికే పలువురి రైతుల వరి పంట కోత దశకు చేరింది, పలు చోట్ల పంట నేలవాలింది. అయితే ఉన్నఫలంగా తుఫాను మొదలైంది. ఇప్పట్లో వర్షం వచ్చిందంటే వరి ధాన్యం మొలకలు వచ్చి దిగుబడి దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. తు ఫాను తీవ్రత పెరిగితే వరి పొలాలలో నీరు నిలిచి, కోత వేసే యంత్రా లు కూడా పంట కోయలేని పరిస్థితి ఏర్పడుతుందని రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కాస్త దయ తలిస్తే గట్టెక్కవచ్చని పలువురు రైతులు తెలుపుతున్నారు.