Share News

Sajjala: సజ్జల సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం..

ABN , Publish Date - May 22 , 2025 | 12:56 PM

వైసీపీ కీలక నేత, గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. వారి కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్న అటవీ భూములను ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Sajjala: సజ్జల సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం..
Sajjala

కడప : వైసీపీ కీలక నేత, గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కడప నగరశివారుల్లో ఉన్న సజ్జల ఎస్టేట్‌లో సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించిన భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీకే దిన్నె మండల పరిధిలోని సజ్జల ఎస్టేట్‌లో అక్రమణకు గురైన 63.72 ఎకరాల ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమించిన భూముల్లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, ఆక్రమించిన భూముల్లో అటవీ భూములు 52 ఎకరాలు, మిగిలినవి అసైన్డ్ భూములు మొత్తం 220 కోట్లు విలువ చేసే భూములను ఆక్రమించి వివిధ రకాల పండ్ల తోటలను సజ్జల కుటుంబం సాగు చేసినట్లు తెలుస్తోంది. కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూములను ఆక్రమించారని గుర్తించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.


Also Read:

Ex CM Jagan: జగన్ స్క్రిప్ట్‌లో నో చేంజ్

Denied Promotion: పనిలో టాలెంట్ చూపించారని ప్రమోషన్ నిరాకరణ.. నెట్టింట ఉద్యోగి ఆవేదన

WHO: పాక్ పన్నాగం పటాపంచలు.. WHOలో అనుపమ స్పీచ్.. వైరల్

Updated Date - May 22 , 2025 | 01:09 PM