Share News

Minister Anagani Sathya Prasad : గెస్ట్‌ హౌస్‌ కోసమా.. ఎర్రచందనం కోసమా?

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:51 AM

: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం దేనికోసం వినియోగిస్తుందో అర్థం కావడం లేదని..

 Minister Anagani Sathya Prasad : గెస్ట్‌ హౌస్‌ కోసమా.. ఎర్రచందనం కోసమా?

  • పెద్దిరెడ్డిపై అనగాని ఫైర్‌

తిరుపతి, కల్లూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం దేనికోసం వినియోగిస్తుందో అర్థం కావడం లేదని.. గెస్ట్‌ హౌస్‌ కోసమా.. లేక ఎర్రచందనం అక్రమ రవాణా కోసమా.. అన్నదానిపై అనుమానాలున్నాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. శుక్రవారం రాత్రి తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నపుడు చిత్తూరుతో పాటు ఇతర జిల్లాల్లోనూ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై 2వారాలలో విచారణ పూర్తయి నివేదిక వస్తుందన్నారు. అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబంపైనా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

పెద్దిరెడ్డి పొలం ప్రధాన మార్గం సర్వే

మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం భూములు ఆక్రమణ ఆరోపణలపై విచారించి నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో అధికారులు శుక్రవారం పెద్దిరెడ్డి పొలానికి వెళ్లే రోడ్డును సర్వే చేశారు. జేసీ విద్యాధరి, డీఎ్‌ఫవో భరణి ఆధ్వర్యంలో రోవర్‌, జీపీఎస్‌, టేపు ద్వారా రోడ్డును కొలిచారు. 4మీటర్ల వెడల్పుతో 2.2 కి.మీ. రోడ్డు అటవీశాఖ పరిధిలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:51 AM