Tirumala : యూకే నుంచి కూతురు, అల్లుడిని రప్పించి.. తిరుమలలో దంపతుల ఆత్మహత్య
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:15 AM
తిరుపతిలోని అబ్బన్నకాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు మూడేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్‌గా వీఆర్‌ఎస్ పొందారు.

విశ్రాంత భవనంలో ఫ్యాన్‌కు ఉరి.. కుటుంబ కలహాలతోనే అఘాయిత్యం!
తిరుమల, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): తిరుపతికి చెందిన ఓ రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్, భార్యతో కలిసి శుక్రవారం తిరుమలలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతిలోని అబ్బన్నకాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు మూడేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్‌గా వీఆర్‌ఎస్ పొందారు. శ్రీవారి దర్శనం కోసం గురువారం భార్య అరుణ, తమ్ముడు రమేష్, మరదలితో కలిసి తిరుమలకు వచ్చారు. ఓ విశ్రాంతి భవనంలో గది తీసుకున్నారు. సాయంత్రం దర్శనం పూర్తికాగానే రమేష్ తన భార్యతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు నాయుడు, అరుణకు ఎన్నిసార్లు ఫోను చేసినా తీయలేదు. అనుమానం వచ్చి తిరుపతిలో ఇంటి వద్ద ఉన్న కుమార్తె జయశ్రీ, అల్లుడు శ్రీకాంత్ శుక్రవారం మఽధ్యాహ్నం తిరుమలకు వచ్చారు. విజిలెన్స్, పోలీసుల సాయంతో తలుపులు తెరిచి చూడగా వారు ఉరికి వేలాడుతూ కనిపించారు. కాగా, యూకేలో ఉంటున్న కుమార్తె, అల్లుడిని పదిరోజుల క్రితమే ఇండియాకు రప్పించినట్టు తెలుస్తోంది. తమ చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్న సూసైడ్‌నోట్ పోలీసులకు లభించినట్లు తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం