నాలుగు రోజుల్లోTirumala: శ్రీవారిని దర్శించుకున్న 3.28 లక్షల మంది భక్తులు
ABN , Publish Date - May 27 , 2025 | 05:51 AM
వేసవి సెలవుల చివర్లో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. నాలుగు రోజుల్లో 3.28 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 10.98 లక్షల మందికి అన్నప్రసాదాలు, 1.52 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.
తిరుమల, మే26(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో తిరుమల శ్రీవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గురు, శుక్ర, శని, ఆదివారాల్లో 3,28,702 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకించి శనివారం 90,211 మంది, ఆదివారం 91,538 మంది రికార్డుస్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక, ఈ నాలుగురోజుల్లో 10.98 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించగా, 4.55 లక్షల మందికి టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందజేశారు. 1.52 లక్షల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News