Vizag Rave Rumors: విశాఖలో రేవ్ పార్టీ కలకలం
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:22 AM
విశాఖపట్నంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. స్నేహితుల దినోత్సవం వేడుకల పేరుతో భీమిలి బీచ్‌రోడ్డులోని రెండు
ఫ్రెండ్షిప్ డే పేరుతో ఓ రిసార్ట్‌లో లేట్‌నైట్ పార్టీ
డ్రగ్స్ వాడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. స్నేహితుల దినోత్సవం వేడుకల పేరుతో భీమిలి బీచ్‌రోడ్డులోని రెండు చోట్ల ఆదివారం రాత్రి రేవ్ పార్టీలు నిర్వహించారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ రెండు చోట్లకు భారీఎత్తున హాజరైన యువత కేరింతలు కొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రేవ్ పార్టీ ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు చెప్పారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖలో పలు హోటళ్లు, రెస్టారెంట్‌లు, పబ్‌లు, రిసార్ట్స్‌ల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. తొట్లకొండ వద్ద ఉన్న ఒక రిసార్టులో రేవ్ పార్టీ జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అలాగే తిమ్మాపురం సమీపంలోని ఒక రెస్ర్టో పబ్‌లో కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ రెండు చోట్ల కొందరు మత్తెక్కించే డ్రగ్స్ వాడినట్టు జరిగిన ప్రచారం పోలీసులు దృష్టికి చేరింది. ఆ రిసార్టు, పబ్‌లకు వెళ్లి పోలీసులు సోదాలు చేశారు. పోలీసులను చూసి పార్టీకి వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే తమ సోదాల్లో రేవ్ పార్టీ జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఫ్రెండ్స్ డే సందర్భంగా పార్టీ నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతులు తీసుకున్నారని, దాని ప్రకారమే కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు రేవ్‌పార్టీ గానీ, డ్రగ్ వినియోగం గానీ జరగలేదని భీమిలి పోలీసులు స్పష్టం చేశారు. అయితే భీమిలి బీచ్‌రోడ్డులోని హోటళ్లు, రిసార్టులు, పబ్‌ల్లో తరచూ లేట్‌నైట్ పార్టీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News