Rare conjoined Twin Snakes: అవిభక్త కవల పాములు
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:09 AM
ఇవి నాగజెర్రి రకానికి చెందిన అవిభక్త కవల పాము లు. ఈ రెండు పాములకు కలిపి ఒకే తోక ఉంది.
ఆంధ్రజ్యోతి, పలాస: ఇవి నాగజెర్రి రకానికి చెందిన అవిభక్త కవల పాములు. ఈ రెండు పాములకు కలిపి ఒకే తోక ఉంది. గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస సమీప అంబుసోలి గ్రామంలో ఇవి కనిపించాయి. వీటిలో ఒక పాము రోడ్డు దాటుతుండగా.. మరొకటి దాన్ని అనుసరిస్తోంది. స్థానికులు వీటిని మెల్లగా పొదల్లోకి పంపించారు. పాముల్లో అవిభక్త కవలలు ఉండటం చాలా అరుదు అని పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ మట్ట రవికృష్ణ చెప్పారు. ఒక పిండంలో రెండు పాములు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయన్నారు.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం