Share News

Travels Bus: ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్నారా.. బస్సుల్లో బంపర్ ఆఫర్లు.. వాళ్లకు మాత్రమే..

ABN , Publish Date - Jan 18 , 2025 | 06:46 PM

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే ప్రయివేట్ ట్రావెల్స్ ఒకే బస్సులో వివిధ ధరలను వసూలు చేస్తోంది. ఒక బసులో అన్ని సీట్లకు ఒకటే ధర నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు యాజామన్యాలు తమ బస్సులో అన్ని సీట్లను సేల్ చేసుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముందు భాగంలో సీట్లు, బెర్తులకు..

Travels Bus: ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్నారా.. బస్సుల్లో బంపర్ ఆఫర్లు.. వాళ్లకు మాత్రమే..
Travels Bus

పండుగ సెలవులు ముగిశాయి. హైదరాబాద్ నుంచి ఫెస్టివల్ కోసం సొంతూర్లకు వెళ్లిన జనం తిరుగుముఖం పట్టారు. ఇప్పటికే కొందరు హైదరాబాద్ నగరానికి చేరుకోగా.. మరికొందరు ఈరోజు, రేపట్లో రానున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే ఆర్టీసీతో పాటు ప్రైవెట్ ట్రావెల్స్‌ బస్సుల్లో టికెట్లు మొత్తం బుక్ అయిపోయాయి. ఏపీ నుంచి తెలంగాణకు రావాలంటే రైళ్లలో సీట్లు అందుబాటులో ఉండకపోవడంతో బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే మంచి సమయంగా భావించిన ప్రైవెట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ల ధరను భారీగా పెంచేశాయి. సాధారణ రోజుల్లో రూ.600 నుంచి రూ.700గా ఉండే బస్సు టికెట్ ధరలు ప్రస్తుతం రూ.2వేలు దాటుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే వంద నుంచి 200 శాతం బస్సు టికెట్ ధరలు పెరిగాయి. ఇంత ధర పెరిగినా కొంతమందికి మాత్రం బస్సుల్లో ప్రైవెట్ ట్రావెల్స్ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ ఆఫర్లు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇంతకీ ఆ ఆఫర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


మహిళలకు బంపర్ ఆఫర్లు..

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే ప్రయివేట్ ట్రావెల్స్ ఒకే బస్సులో వివిధ ధరలను వసూలు చేస్తోంది. ఒక బసులో అన్ని సీట్లకు ఒకటే ధర నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు యాజామన్యాలు తమ బస్సులో అన్ని సీట్లను సేల్ చేసుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముందు భాగంలో సీట్లు, బెర్తులకు ఒక ధర అయితే, వెనుక భాగం సీట్లు, బెర్తులకు మరో ధరను వసూలు చేస్తున్నాయి. అప్పర్ బెర్తులకు ఓ ధర, లోయర్ బెర్తులకు మరో ధరను వసూలు చేస్తున్నాయి. అప్పర్, లోయర్ బెర్తుల మధ్య రూ.వంద వరకు తేడా ఉంటుంది. అదే సమయంలో సింగిల్ లేడీస్ ఎవరైనా బెర్తులు బుక్ చేసుకుంటే ఆ పక్కన ఉండే మరో సింగిల్ బెర్తు ధరకు భారీ తగ్గింపు ఇస్తున్నారు. సింగిల్ లేడీ పక్కన మరో లేడీకే అవకాశం ఇవ్వాల్సి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బెర్తు ఖాళీగా ఉండకుండా ఉండేందుకు.. ఎవరైనా మహిళలు ఆ బెర్తు బుక్ చేసుకునేలా ఆకర్షించేందుకు ధర తగ్గిస్తున్నారు.


సగానికి పైగా..

ప్రస్తుతం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారి సంఖ్య ఎక్కువుగా ఉండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు రోజువారీ సర్వీసులతో పోలిస్తే ఎక్కువ సర్వీసులను నడుపుతున్నారు. ఒక బసులో రెండు బెర్తులు కలిసి ఉండేచోట రూ.1500 పెట్టి ఓ మహిళ టికెట్ కొనుగోలు చేస్తే పక్కనే ఉండే మరో సింగిల్ సీట్ తప్పనిసరిగా మహిళకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అందుకోసం సగానికి పైగా ధర తగ్గించి ఆ టికెట్లను విక్రయిస్తున్నారు. పురుషుల విషయంలో ఇలాంటి ఆఫర్లు ఇవ్వడంలేదు. దీంతో మహిళలు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఒకట్రెండు సార్లు చెక్ చేస్తే మంచి డిస్కౌంట్‌లో టికెట్లు లభిస్తాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 18 , 2025 | 06:46 PM