Share News

PM Modi: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

ABN , Publish Date - Oct 16 , 2025 | 10:53 AM

కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ తదితరులు మోదీకి స్వాగతం పలికారు.

PM Modi: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
PM modi

అమరావతి, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ తదితరులు మోదీకి స్వాగతం పలికారు. ఇక విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ప్రధాని సున్నిపెంట చేరుకోనున్నారు. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.05 గంటల వరకు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నన్నూరుకు బయల్దేరుతారు. రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వద్ద ‘సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌’ బహిరంగ సభకు మోదీ హాజరై ప్రసంగించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4:45 గంటలకు తిరిగి దిల్లీ పయనమవుతారు.


ఉమ్మడి కర్నూలు జిల్లా వృద్ధికి తోడ్పడే ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. కాగా, ప్రధాని మోదీ ప్రసంగం పై ఆసక్తి నెలకొంది. అంతకు ముందు కర్నూలు విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేరుకున్నారు. వీరికి సీఎం, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.

Updated Date - Oct 16 , 2025 | 11:09 AM