Share News

Power tower collapse: వెలగపూడిలో కూలిన విద్యుత్‌ హైఓల్టేజీ టవర్‌

ABN , Publish Date - May 05 , 2025 | 05:35 AM

వెలగపూడి గ్రామంలో గాలివాన కారణంగా విద్యుత్‌ హై ఓల్టేజీ ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ కూలిపోయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుని, ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Power tower collapse: వెలగపూడిలో కూలిన విద్యుత్‌ హైఓల్టేజీ టవర్‌

ప్రధాని సభావేదికకు కూతవేటు దూరంలో ఘటన

వైసీపీ హయాంలో బోల్టులు కాజేసిన దుండగులు

గుంటూరు, మే 4(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని వెలగపూడి గ్రామంలో విద్యుత్‌ హై ఓల్టేజీ ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ కూలిపోయింది. ఆదివారం ఉదయం సంభవించిన గాలివాన బీభత్సానికి టవర్‌ పక్కకు పడిపోయింది. ఈనెల 2న ప్రధాని మోదీ సభ జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే ఎన్‌-9 రోడ్డుకు దగ్గరలో ఈ-7, ఈ-8 రోడ్ల మధ్య ఈ టవర్‌ కూలిపోవడం గమనార్హం. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రధాని సభ రోజున టవర్‌ కూలి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, టవర్‌ కూలిపోవడంతో ఆదివారం ఉదయం నుంచి వెలగపూడి ప్రజలు విద్యుత్‌ సరఫరా లేక ఇబ్బంది పడ్డారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్లక్ష్యం చేసింది. దీంతో దుండగులు ఇనుము, కంకర, ఇసుకను ఇష్టారాజ్యంగా దోచుకుపోయారు. ఈ క్రమం లో కొందరు ఈ హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్ల బోల్టులు, నట్లు, ఇనుప బద్దీలను కూడా పీక్కుపోయారని రైతులు చెబుతున్నారు. ఇలా బోల్టులు పీక్కుపోయిన టవర్లు ఇంకా పదికిపైగా ఉన్నాయని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 05:35 AM