Share News

Poultry Farm Subsidy: పట్టణాల్లో కోళ్ల ఫాం నిర్మాణాలకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:43 AM

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కోళ్ల ఫాం రైతులకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఫీజుల్లో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Poultry Farm Subsidy: పట్టణాల్లో కోళ్ల ఫాం నిర్మాణాలకు ప్రోత్సాహం

  • డెవలప్‌మెంట్‌, బెటర్‌మెంట్‌ చార్జీలు మినహాయింపు

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కోళ్ల ఫాం రైతులకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఫీజుల్లో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో నిర్మించే కోళ్ల ఫాంలకు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన డెవలప్‌మెంట్‌ ఫీజులు, బెటర్‌మెంట్‌ చార్జీల్లో పూర్తి మినహాయింపు ఇస్తూ మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా లైసెన్స్‌ ఫీజులను గ్రామీణ ప్రాంతాల తరహాల్లో నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ పౌల్ట్రీ ఫెడరేషన్‌ విజ్ఞప్తితో పశుసంవర్థక శాఖ డైరక్టర్‌ ప్రతిపాదనలతో మున్సిపల్‌ శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

Updated Date - Jun 07 , 2025 | 03:44 AM