Share News

Yogandhra: ఏపీ నాయకుల పనితీరు భేష్.. ప్రధాని ప్రశంసలు..

ABN , Publish Date - Jun 20 , 2025 | 09:11 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారుగా అంటూ ప్రభుత్వ పెద్దలను అభినందించారు. జూన్ 21న యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో

Yogandhra: ఏపీ నాయకుల పనితీరు భేష్.. ప్రధాని ప్రశంసలు..
International Day of Yoga

విశాఖపట్నం, జున్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారుగా అంటూ ప్రభుత్వ పెద్దలను అభినందించారు. జూన్ 21న యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 లక్షల మందికి పైగా జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం సాయంత్రమే విశాఖకు చేరుకున్నారు. భువనేశ్వర్‌లో బహిరంగ సభ అనంతరం.. నేరుగా విశాఖకు చేరుకున్నారు ప్రధాని.


ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్‌లు స్వాగతం పలికారు ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణ ఏర్పాట్లపై ప్రధాని కాసేపు మాట్లాడారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చేసేలా చేశారుగా అంటూ సీఎం చంద్రబాబుకు కితాబిచ్చారు ప్రధాని. యోగాంధ్ర ద్వారా సరికొత్త రికార్డ్ సృష్టిస్తు్న్నామని ప్రధానితో సీఎం చంద్రబాబు చెప్పారు. యోగాంధ్ర ఏర్పాట్ల గురించి తెలుసుకున్న ప్రధాని.. ఏపీ నాయకుల పనితీరు భేష్ అంటూ ప్రశంసించారు.


Also Read:

ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ

విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 20 , 2025 | 09:11 PM